ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతుల రాస్తారోకో

సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ రైతులు రాజీవ్ రహదారిపై గురువారం నిరసనకు దిగారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిపై రైతులు బైఠాయించి, తాము పండించిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రైతుల రాస్తారోకోతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. అనంతరం నిరసనను విరమింపజేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Leave a Reply