gold rate| వ‌రుస‌గా నాలుగో రోజు ధ‌ర‌లు పైపైకి..

gold rate| వ‌రుస‌గా నాలుగో రోజు ధ‌ర‌లు పైపైకి..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న రేట్ల‌తో కొనుగోలుదారుల‌కు చుక్కలు క‌నిపిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు బంగారం ధర పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ సంవత్సరం పాటు బంగారం, వెండి కొనుగోళ్లను వాయిదా వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని ప్రకటన నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం పెంచడంతో గోల్డ్ భారం అవుతోంది. బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా గోల్డ్ రేట్ పెరిగింది. గత నాలుగు రోజుల్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.9980 పెరిగింది. మే 13న ఒక్కసారిగా దూసుకెళ్లిన గోల్డ్ రేట్, సాయంత్రానికి కాస్త తగ్గింది. మే 14న బంగారం ధర మళ్లీ పెరిగింది. బంగారం ధర రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల వైపు ప‌రుగు పెడుతుండ‌టంతో పసిడిప్రేమికుల్లో గుండెల్లో గుబులు మొద‌లైంది. ఇక‌పై బంగారం కొన‌డం భారంగా మారుతుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మే 14న ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.1,62,000 నుంచి రూ.1,62,330కి చేరుకుంది. 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.1,48,500 నుంచి రూ.1,48,800కి చేరుకుంది. ఇక 18 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.1,21,500 నుంచి రూ.1,21,750కి చేరుకుంది.

గత నాలుగు రోజుల్లో కిలో వెండి ధర సుమారు రూ.40 వేలు పెరిగింది. బుధవారం కిలో వెండిపై రూ.20వేలు పెరగ్గా.. ఇవాళ (గురువారం) వెండి రేటు తగ్గింది. కిలో వెండిపై రూ. 5వేలు తగ్గింది. వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.3,15,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.3,00,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.3,15,000 వద్దకు చేరింది.