ధాన్యం తరలింపు తక్షణ చర్యలు

ధాన్యం తరలింపు తక్షణ చర్యలు

  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం పరిధిలోని మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులలోని గోదాములకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలింపుకు అవసరమైన లారీలను ఎప్పటికప్పుడు సమయాత్త పరుస్తూ తరలింపు ప్రక్రియను సమీక్షించుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు ఆలస్యం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాము కూడా ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ అవసరమైన చర్యలకు అధికారులకు సూచనలు ఇస్తామని చెప్పారు.