ఫకీరాబాద్ రైల్వే గేట్ ఆరు రోజులపాటు మూసివేత

ఫకీరాబాద్ రైల్వే గేట్ ఆరు రోజులపాటు మూసివేత

బాసర, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఫకీరాబాద్ నుంచి బోధన్‌కు వెళ్లే మార్గంలో ఉన్న ఫకీరాబాద్ రైల్వే గేట్‌ను ఆరు రోజులపాటు మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

సీనియర్ సెక్షన్ ఇంజనీర్ తెలిపిన వివరాల ప్రకారం.. మే 14 ఉదయం 6 గంటల నుంచి మే 19 సాయంత్రం 6 గంటల వరకు రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. బీసీఎం మిషన్ పనులు, రైళ్లు, రోడ్డు ట్రాఫిక్ సురక్షిత ప్రయాణం కోసం అత్యవసర మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఈ గేట్ మూసివేతతో నవీపేట, ఫకీరాబాద్, మద్దెపల్లి, ఖోస్లీ గ్రామాల ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Leave a Reply