హనుమంతు మృతి బీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటు

హనుమంతు మృతి బీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటు

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి

మోత్కూర్, ఆంధ్రప్రభ: మండలంలోని పనకబండ మాజీ సర్పంచ్, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ సింగిల్ విండో చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బత్తిని హనుమంతు మృతి పార్టీకి తీరని లోటని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డి అన్నారు.

మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మరణించిన బత్తిని హనుమంతు పార్థివ దేహానికి బుధవారం కంచర్ల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమంతు పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని, ప్రజలతో మమేకమై పనిచేసిన నాయకుడిగా గుర్తుండిపోతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోన్నెబోయిన రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కొణతం యాకూబ్ రెడ్డి, తీపిరెడ్డి మెగారెడ్డి, అడ్డగూడూరు మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండ సోంమల్లు, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, మాజీ ఎంపీటీసీ పానుగుల్ల విష్ణుమూర్తి, గ్రామ శాఖ అధ్యక్షుడు లోతుకుంట స్వామి, మాజీ సర్పంచ్‌లు బయ్యని పిచ్చయ్య, బత్తిని తిరుమలేష్, నాయకులు ఎలుగు సోమయ్య, పోన్నెబోయిన నరసయ్య, పైళ్ల బుచ్చయ్య, అంజయ్య, మచ్చగిరి, పైళ్ల రమేష్, మహేష్, కనేబోయిన లింగం, వల్లందాస్ బుగ్గ రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply