నాణ్యమైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

నాణ్యమైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
-టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
తొర్రూరు, ఆంధ్రప్రభ:
తొర్రూరు వంటి ప్రాంతాలలో అందుబాటులో ఉన్న కార్పొరేట్ స్థాయి లాంటి నాణ్యమైన వైద్య సేవలను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి కోరారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను బుధవారం స్థానిక హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మహేష్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరు డివిజన్ కేంద్రంలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని,తొర్రూరు డివిజన్ చుట్టూ పరిసరాల ప్రాంత ప్రజలు సుధీర ప్రాంతాలకు వెళ్లకుండా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని అందుబాటులో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు.
వైద్య సేవలు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని హాస్పిటల్ నిర్వాహకులకు సూచించారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా ఈ హాస్పిటల్ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్,కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి,జక్కా మహబూబ్ రెడ్డి, వెంకన్న యాదవ్, మహేష్ యాదవ్,కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.
