కవ్వాలలో ఘనంగా ఎల్లమ్మ బోనాల వేడుకలు..
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాలలో ఎల్లమ్మ బోనాలను రంగా రంగా వైభవంగా ఎంతో ఘనంగా మంగళవారం నిర్వహించారు.గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామ కూడలి నుంచి ఎంతో భక్తిశ్రద్ధలతో మహిళలంతా బోనాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా గ్రామం మధ్యలోని ఎల్లమ్మ దేవాలయం వరకు వెళ్లి బోనాలు సమర్పించుకొని పూజలు చేసి,మొక్కులు తీర్చుకున్నారు.

ఈ వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ లక్ష్మీనారాయణ, సర్పంచి సక్రునాయక్, గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు పోచాగౌడ్, నేతలు సత్య గౌడ్, మల్లేష్,సతీష్ గౌడ్, తిరుపతి గౌడ్,లచ్చాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
