సత్ప్రవర్తనతో మెలిగితే రౌడీషీట్లు తొలగింపు

సత్ప్రవర్తనతో మెలిగితే రౌడీషీట్లు తొలగింపు

  • ఎస్సై జె. శ్రీధర్

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : సమాజంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలుగుతూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని రామకృష్ణాపూర్ ఎస్సై జె. శ్రీధర్ పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వివాదాలు, బెదిరింపులకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో సమాజంలో మార్పు తీసుకువచ్చేలా సత్ప్రవర్తనతో జీవనం కొనసాగించాలని సూచించారు. మంచి ప్రవర్తన కనబరిచి, నేరాలకు దూరంగా ఉంటున్న వారి రౌడీషీట్లను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని ఎస్సై తెలిపారు. ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే చర్యలను పోలీసులు ఏమాత్రం ఉపేక్షించబోరని ఆయనపునరుద్ఘాటించారు. రౌడీషీటర్లలో పరివర్తన తీసుకురావడం, వారిని మంచి మార్గంలో నడిపించడమే ఈ కౌన్సెలింగ్ ముఖ్య ఉద్దేశమని పోలీసులు తెలిపారు.