ప్రచారం నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు.

ప్రచారం నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు.

బడి పిలుస్తోంది..
సింగ్ నగర్కు వచ్చిన చ్యతన్య రథం

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ రూపొందించిన బడి పిలుస్తోంది, చ్యతన్య రథం సింగ్ నగర్లోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు పాల్గొని ప్రచారం చేస్తూ ప్రజలను అవగాహన కల్పించారు. ఈ ప్రచార రథం ను ఏ. ఎస్. ఎల్. ఓ. జిల్లా కో ఆర్డినేటర్ ప్రసాద బాబు ఎమ్. కె.బేగ్ స్కూల్ లోని మండల శాఖ కార్యాలయంలో ప్రారంభించారు.నార్త్ మండల విద్యా అధికారులు పి.శ్యాంప్రసాద్, బి. వెంకటేశ్వర రావు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.ఎమ్.కె.బేగ్ మునిసిపల్ ఎలీమెంటరి,హై స్కూల్ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఎమ్.ఎస్.ఇమాం బాష,ఇంచార్జి ఎమ్. హుస్సేన్,వివేకానంద ఎలీమెంటరి,హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు పి.శివాజీ,పి. ఎస్. ఎన్ మూర్తి, సి. ఆర్. పి.ఆశాలత,క్లస్టర్ లోని వివిధ పాఠ శాలల ఉపాధ్యాయులు,విద్యార్థు లు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.ప్రచార రథం ర్యాలీ, లెనిన్ సెంటర్, మసీదు సెంటర్,దాబా కోట్లు,లూనా సెంటర్, రామాలయం సెంటర్ ల మీదుగా ఎమ్. కె. బేగ్ స్కూల్కు చేరుకుంది.