పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠకు రావాలి..

పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠకు రావాలి..
- ఖానాపూర్ ఎమ్మెల్యేకు ఆహ్వానం
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ జీపీ పరిధిలో గల మొర్రిగూడెం గ్రామంలో నిర్మిస్తున్న నూతన పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, గ్రామంలో భక్తి భావంతో నిర్మిస్తున్న పోచమ్మ ఆలయం గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కడెం మాజీ జెడ్పీటీసీ తక్కల్ల రాధ సత్యనారాయణ, జీపీ వార్డు సభ్యుడు తాటికొండ వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు సత్తన్న, నర్ర మల్లేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
