పెరుగుతున్న ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్లు…

పెరుగుతున్న ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్లు…

  • ఎంఈఓ లలిత కుమారి

శావల్యాపురం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారని, ఆ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని మండల విద్యాశాఖ రెండవ అధికారి పుసులూరి లలిత కుమారి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమం మండలంలోని మతుకుమల్లి గ్రామంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లలిత కుమారి పాల్గొని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి 6 గురు విద్యార్థులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆధునిక భోధన, అధునాతన సామగ్రి, అర్హత కలిగిన ఉపాధ్యాయులున్నారన్నారు. విద్యార్థిమిత్ర ద్వారా ఉచితంగా కిట్లను పంపిణీ చేయడంతో పాటు మధ్యాహ్న భోజనంలో పౌష్ఠి కాహారం అందిస్తున్నామన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని, అందుకు ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 10వ తరగతి విద్యార్థుల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఎంఈఓతో పాటు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రామాంజమ్మ, ప్రధానోపాధ్యాయులు కె.మురళీమోహన్, ఉపాధ్యాయులు కె.వీణపాణి, ఎన్.భ్రమరాంబ, కోటేశ్వరరావు, రామకృష్ణ, జి.వెంకట సౌజన్య,శంకర్, ఏడుకొండలు ఉన్నారు.

Leave a Reply