బాధిత కుటుంబానికి సునీత రాజేందర్ ఆర్థిక సహాయం..
తొర్రూరు, ఆంధ్రప్రభ : మండలంలోని వెలికట్ట గ్రామానికి చెందిన దడిగల చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల మహిళా నాయకురాలు మాలోత్ సునీత రాజేందర్ బాధిత కుటుంబాన్ని సందర్శించి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులకు రూ.5 వేల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రెడ్డిల సహకారంతో గ్రామంలోని పేద బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు. నిరుపేదలు ఆపదలో ఉంటే తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నట్లు తెలిపారు.
పేదలకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలు సకాలంలో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద మంగ్య తండా సర్పంచ్ జాటోత్ రాం లాల్ నాయక్, కాంగ్రెస్ నాయకులు బందు వెంకన్న, భోగ కమలాకర్, దీకొండ యాకన్న, కొమ్ము శ్రీను, బందు రవీందర్, బంధు యాకయ్య, నక్క కొమరవెల్లి, కిషన్, లచ్చిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
