కాంగ్రెస్ అబద్ధాల రాజకీయాలు చేస్తోంది..
కాంగ్రెస్ అబద్ధాల రాజకీయాలు చేస్తోంది..
మోదీ తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్.. దేశంలో ప్రస్తుతం కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా అబద్ధాల పాలన సాగిస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చి ప్రజలను ఆకాశానికి ఎత్తి, ఆ తర్వాత చుక్కలు చూపిస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ మావోయిస్టు భావజాలానికి దగ్గరవుతోందని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఒకప్పుడు మావోయిస్టుల హింసతో తీవ్రంగా నష్టపోయిందని గుర్తు చేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావాన్ని తగ్గించామని, కానీ తెలంగాణలో ఇంకా ఆ ప్రభావం పూర్తిగా తగ్గలేదని అన్నారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ, మద్దతు ఇస్తే తెలంగాణలో కూడా మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
