మల్లక్కపేట శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో వరుణయాగం

వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు, భక్తులు

పరకాల, ఆంధ్రప్రభ: పరకాల మండలంలోని మల్లక్కపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ మంగళవారం వరుణయాగం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేవాలయాల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయంలో శ్రీ భక్తాంజనేయ స్వామివారికి కలశాభిషేకం, సింధూర అర్చన, వరుణయాగం నిర్వహించారు.

ప్రత్యేక పూజల్లో అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య యాగాన్ని నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రత్నాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు కాటూరి జగన్నాథాచార్యులు, శరత్ చంద్ర ఆచార్య, రాఘవాచార్య, ఆలయ సిబ్బంది రమేష్ గోపు, భక్తులు పాల్గొన్నారు.