DemoClass | ఖమ్మం కళాశాలలో విషాద ఘటన

DemoClass | ఖమ్మం కళాశాలలో విషాద ఘటన

DemoClass | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా డెమో క్లాస్ ఇస్తున్న ఓ లెక్చరర్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.

పాఠం బోధిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. అయితే, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో కళాశాలలో విషాద వాతావరణం నెలకొంది. ఆకస్మిక మరణంతో సహచర అధ్యాపకులు, విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.