పెన్నాహోబిలం స్వామి బ్రహ్మోత్సవాల విజయానికి అందరికీ కృతజ్ఞతలు..

పెన్నాహోబిలం స్వామి బ్రహ్మోత్సవాల విజయానికి అందరికీ కృతజ్ఞతలు..
పయ్యావుల కుటుంబ సేవలను కొనియాడిన దేవస్థానం
మహారథోత్సవం చారిత్రాత్మక విజయమన్న నిర్వాహకులు
భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ
అధికారుల సమన్వయం ప్రశంసనీయం
మీడియా సహకారం అమూల్యమన్న ఆలయ కమిటీ
స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్ర మైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మో త్సవాలు విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి, దేవాలయ ఈవో సాకే రమేష్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేగటి నాగరాజు, మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్నాహోబిలం వార్షిక బ్రహ్మోత్సవాలు, మహా రథోత్సవం అఖండ విజయాన్ని సాధించిన, ఈ పుణ్య సందర్భంగా ముందు గా పయ్యావుల కుటుంబానికి దేవస్థానం తరపున ధర్మకర్తల మండలి తరపున ఘన కృతజ్ఞతాభివందనములు తెలిపారు. దివంగత కీర్తిశేషులు పయ్యావుల వెంకట నారాయణప్ప దేవస్థాన అభివృద్ధికి, స్వామివారి సేవకు వేసిన పునాది, నేటికి ఆ కుటుంబం అదే భక్తి, అదే అంకితభావం తో కొనసాగించడం ఎంతో ఆదర్శప్రాయము.
తరతరాలు గా పెన్నోబిలం క్షేత్రంలో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కొనసాగిస్తూ, స్వామి వారి సేవను కుటుంబ ధర్మంగా భావించి చేస్తున్న సేవలు భక్తుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతు న్నాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఈ బ్రహ్మోత్సవా లు మహారథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిం చేందుకు అందించిన సహకారం మార్గదర్శనం ప్రత్యేక చొరవ సేవా భావం మరవలేనివి అన్నారు. భక్తుల కోసం త్రాగునీటి వసతులు, చలువ పందిళ్లు, విద్యుత్ సదుపాయాలు, రథోత్సవ ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వివిధ శాఖల సమన్వయం, దేవస్థానం అభివృద్ధి పనులు వంటి ప్రతి అంశంలో వారి ప్రత్యేక శ్రద్ధ ఈ ఉత్సవాలను చారిత్రాత్మక విజయంగా నిలపాయి.
ఈ మహోత్సవాల విజయవంత మైన అహర్నిశలు శ్రమించిన జిల్లా యంత్రాంగ అధికారులకు, రెవెన్యూ, పోలీస్, విద్యుత్తు ఆర్ అండ్ బి, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, పంచాయతీ రాజ్, ట్రాన్స్పోర్ట్, దేవాదాయ శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భక్తులకు ఎటు వంటి అసౌకర్యాలు కలగ కుండా సేవలు అందించడం లో అధికారుల సమన్వయం, కర్తవ్య నిబద్దత, సేవాస్ఫూర్తి ప్రశంసనీయం. ఆలయ అర్చక స్వాములు, వేదపండితులు,దేవస్థానం సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు విద్యుత్ సిబ్బంది, సేవా సంస్థలు, దాతలు గ్రామ ప్రజలు, ప్రతి భక్తునికి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మోత్సవాల వైభవాన్ని స్వామివారి మహిమను, దేవస్థానం చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో మీడియా అందించిన సహకారం అమూల్యమైనది. నిరంతరం క్షేత్రంలో ఉండి భక్తులకు ప్రతి సమాచారాన్ని చేరవేస్తూ ఉత్సవాల విజయానికి మీడియా మిత్రులు వంతెనగా నిలిచారు. ధార్మికతను ప్రజల్లో మరింతగా చాటి చెప్పే మీ సేవలు నిజంగా అభినందనీయం తెలిపారు.
