పీఆర్‌సీ ఛైర్మన్‌ను వెంటనే నియమించాలి..
పీఆర్‌సీ ఛైర్మన్‌ను వెంటనే నియమించాలి..
ఐఆర్‌పై సానుకూల నిర్ణయం తీసుకోండి
సరెండర్ లీవ్‌ల బకాయిలను క్రమపద్ధతిలో చెల్లించండి
పీ ఆర్ సి కోసం 13 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఎదురుచూపు
21 వేలకోట్ల బకాయిల చెల్లింపు పై హర్షం
ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందిస్తున్నాం
ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్
విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణ ప్రక్రియలో ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా వెంటనే పీఆర్‌సీ ఛైర్మన్‌ను నియమించాలని ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ అన్నారు. గురువారం ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ సంఘ నేతలతో కలిసి విశాఖపట్నంలోని ఎన్‌జీవో హోమ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొత్త పీఆర్‌సీపై ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారని తెలిపారు. అయితే ఇప్పటివరకు పీఆర్‌సీ ఛైర్మన్ నియామకం జరగకపోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన, అనిశ్చితి నెలకొందన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం, కుటుంబ భారం నేపథ్యంలో ఉద్యోగులపై ఆర్థికంగా ఒత్తిడిపడుతోందన్నారు.
వేతన సవరణ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు నిలిచిపోయాయని, దీని ప్రభావం వారి కుటుంబాలపై తీవ్రంగా పడుతోందన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, దిగువ స్థాయి ఉద్యోగులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, వారి సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఎల్లప్పుడూ నిర్మాణాత్మక సహకారం అందిస్తున్నాయని విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఉద్యోగుల సంబంధించిన బకాయిల విషయంలో ప్రభుత్వం ఎంత వరకు 21 వేల కోట్ల రూపాయలు చెల్లించిందని ఉద్యోగులకు సంబంధించిన జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ తదితరు బకాయిలతో పాటు పదవి విరమణ చేసిన వారి బకాయిలు కూడా తీర్చిందని దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్న అన్ని తెలిపారు.
ప్రమోషన్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఈ డీపీసీ ల ద్వారా నిరంతర పర్యవేక్షణ ద్వారా ఉద్యోగుల ప్రమోషన్ లో వేగవంతం చేశారని తెలిపారు. ఈ విషయంలో చీఫ్ సెక్రటరీ కి, జిఏడి సెక్రటరీ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు, గురుకుల పాఠశాలలో ఉద్యోగులకు పదవి విరమణ 60పెంపు విషయంలో, అదే 2004 ముందు నోటిఫై అయిన ఉద్యోగులను 57 మేము ప్రకారం ఓ పి ఎస్ లోకి తీసుకురా వచ్చే అంశంలో ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉందని త్వరలోనే ఉత్తర్వులు ఇస్తున్న ఆశ భవాని వ్యక్తం చేశారు. యాక్ట్ 30 ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరామని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళమని తెలిపారు. పెన్షనర్లకు ఎడిషనల్ అకౌంట్ పెన్షన్ ని మరియు గ్రామ సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కూడా ప్రభుత్వం అదే సానుకూల దృక్పథంతో ముందుకు రావాలని ఆయన కోరారు.
సెలవు రోజుల్లోనూ ఉద్యోగులపై పనిభారమా?..
ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని.. అయితే సెలవు రోజుల్లోనూ ఉద్యోగులను ఇబ్బందిపెట్టడం భావ్యం కాదని.. ఆ రోజుల్లో విశ్రాంతికి అవకాశం ఇవ్వాల్సిన అవసరముందని విద్యాసాగర్ అన్నారు. సెలవు రోజుల్లో విశ్రాంతి లభిస్తే మిగిలిన రోజుల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదని.. ఎవరో ఏదో చెప్పారనే దాన్ని మాత్రమే ఆధారంగా తీసుకొని చర్యలకు పాల్పడటం భావ్యం కాదన్నారు.
ఈ సమాచారాన్ని ఒక మోడల్‌గా మాత్రమే తీసుకోవాలని.. సంబంధం లేని ఉద్యోగులపై సైతం చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగుల ఆరోగ్య కార్డుల సమస్య అపరిష్కృతంగానే ఉందని.. హెల్త్ కార్డు ద్వారా ఉద్యోగులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం జరగడం లేదన్నారు. ఈ విషయంలో ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయన్నారు. హెల్త్ కార్డులపై ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశమైందని.. మరోసారి సమావేశానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు.
ఏపీ ఎన్‌జీజీవో ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందడుగు వేసిందని.. ఇదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగుల విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం దృష్టిసారించిందని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ, ఏపీ ఎన్‌జీజీవో కృషిచేస్తోందని.. ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని డీవీ రమణ తెలిపారు. సమావేశంలో ఏపీ ఎన్‌జీజీవో విశాఖపట్నం అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, కార్యదర్శి ఎం.రవికుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు దొర, సుబ్రహ్మణ్యం, పి.అప్పలరాజు, వై.నారాయణరావు, జి.చంద్రరావు, అనిత, రత్నకుమారి, పి.కృష్ణమూర్తి, టి.గోపాలకృష్ణ, అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ రవి, ఏపీ ఎన్‌జీజీవో నేతలు పాల్గొన్నారు.
