మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు

మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో గురువారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా మున్సిపల్ కార్యాలయ తలుపులు మూసివేసి, లోపల పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని బయటకు వెళ్లనివ్వకుండా చర్యలు చేపట్టినట్లు సమాచారం.శాఖల వారీగా రికార్డులను అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.