సర్కారు బడిలో ఉల్లాసంగా ఉత్సాహంగా..
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచితంగా నిర్వహిస్తున్న వేసవి శిబిరాలకు అత్యంత ఆదరణ లభిస్తుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు, సెలవులను విజ్ఞానదాయకంగా మార్చేందుకు ప్రభుత్వ నిర్వహిస్తున్న వేసవి శిబిరానికి విద్యార్థులు అధిక సంఖ్యలో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
వివిధ క్రీడలు, యోగ, సాంప్రదాయ క్రీడలు, సాంస్కృతిక అంశాలపై ధారాళంగా చదవడం రాయడం అందమైన చేతి రాతలను ఆనందోత్సాహాలతో నేర్చుకుంటున్నారు. వినోదాత్మక క్రీడలు విభిన్న సాంస్కృతిక అంశాలు నృత్యాలపై శిక్షణ అందిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు బట్టు మధు, పి డి ఎం యాదగిరిలు తెలిపారు. ఆయా క్రీడలలో ఉపాధ్యాయులు ఎం బాలు ఎం జానకి రాముడు కే ఏ వెంకటేశ్వరరావు సరస్వతి సరిత లు సహకారం అందిస్తున్నారు.
