ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
- సీపీఎం డిమాండ్
చిట్యాల, ఆంధ్రప్రభ ; ధాన్యం కొనుగోలు ఎగుమతులు వేగవంతం చేసి, రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తు దమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల మండలం పిట్టంపల్లి,వెలిమినేడు, చిన్న కాపర్తి,ఆరెగూడెం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం, రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నాడు పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళు, తరుగు పేరుతో రైతులు దోపిడికి గురౌతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎగుమతులకు సరైన లారీలు పంపించటం లో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలం అయ్యారని విమర్శించారు.లారీలు ధాన్యం లోడ్ తో వచ్చినా మిల్లర్ లు సకాలంలో దిగుమతి చేసుకునే పరిస్థితి లేదని అన్నారు. రైతులకు తారుబాళ్ళు లేక వర్షాలు వస్తేధాన్యం తడిసి పోయే ప్రమాదం ఉందని, రైస్ మిల్లు యజమానులు అనేక రకాల కారణాల చెప్పి తాళు, తరుగు పేరుతో తూకంలో కట్ చేస్తున్నారని చెప్పారు. మిల్లు ల వద్ద దిగుమతి ఆలస్యం వల్ల లారీ డ్రైవర్స్, ఓనర్స్ వాహనాలు పంపడం లేదని అన్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11 వ తేదీ న సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అరూరి శ్రీను, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, మెట్టు నర్సింహా, లడే రాములు,సుర్కంటి మోహన్ రెడ్డి, సిపిఎం మండల నాయకులు కోనేటి రాములు, పంది నరేష్, వివిధ ప్రజా సంఘాల నాయకులు వీరమళ్ళ వెంకన్న,రూపని ఇద్దయ్య,ఊడుగు సత్తయ్య,అరూరి శంభయ్య,దేశబోయిన నర్సింహా,ఆడపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
