సంగ్రామ సదస్సును విజయవంతం చేయండి..
సంగ్రామ సదస్సును విజయవంతం చేయండి..
- ముసిపట్ల విజయ్..
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈనెల 6న వరంగల్ లో నిర్వహించే రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ మండల కోఆర్డినేటర్ ముసిపట్ల విజయ్ పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతుల సమస్యలను పట్టించు కోవడం లేదన్నారు.
గత కేసీఆర్ పాలనలో రైతును రాజును చేయాలనే ధ్యేయంతో రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేయడంతోపాటు వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిచామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ సర్కారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదన్నారు.
బీఆర్ఎస్ పాలనలో వ్యవసా యాన్ని పండుగలా చేసి, పంటలకు గిట్టుబాటు ధర అందిస్తే నేటి కాంగ్రెస్ పాల నలో రైతుల పంటలను కొనేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని అన్నారు. దీనికి వ్యతిరేకంగా నిర్వహించే రైతు సంగ్రామ సభకు రఘునాథపల్లి మండలం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు, రైతులు హాజరై విజయవంతం చేయాలాని కోరారు.
