నిత్యాన్నదానానికి లక్ష రూపాయల విరాళం
నిత్యాన్నదానానికి లక్ష రూపాయల విరాళం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం అన్నదానం పథకానికి, విజయవాడ వన్ టౌన్ విద్యాధరపురం కి చెందిన అన్ని త్రివిక్రమ్ బాబు కుటుంబం రూ. 1,00,116/- విరాళాన్ని అందించారు.
వీరు ఈ విరాళాన్ని స్వయంగా ఆలయ ట్రస్ట్ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితులు శంకర్ బాబు ఆలయ అధికారులకు అందజేశారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకర్ బాబు ప్రధానాలయ సూపర్నెంట్ నాగేశ్వరరావు అమ్మవారి చిత్రపటం ప్రసాదం రసీదులు అందజేశారు.
