AP | ఎగ్జిబిషన్‌లో అపశృతి.. ఒక వ్యక్తి మృతి !

పెనుగంచిప్రోలు, (ఆంధ్రప్రభ) : మండల కేంద్రమైన పెనుగంచిప్రోల్‌లో జరిగుతున్న తిరునాల్లో అప‌శృతి చోటుచేసుకుంది. తిరునాల్లో ఎగ్జిబిషన్‌లో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు జెయింట్ వీల్ నుండి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయాలు అయ్యాయి.

మృతుడిని కొత్త వేమవరం గ్రామానికి చెందిన గింజుపల్లికి చెందిన సాయి మణికంఠగా గుర్తించారు. గింజుపల్లికి చెందిన గోపీచంద్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతనికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు.

Leave a Reply