ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
తొర్రూరు, ఆంధ్రప్రభ: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్, హెల్ప్‌లైన్ సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బొలగాని రాములు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ల కోసం దోస్త్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. దోస్త్ ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ఈ నెల 7వ తేదీతో ముగిస్తుందని, విద్యార్థులు ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురైనా కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ ద్వారా పూర్తి సహాయం అందించబడుతుందని తెలిపారు. విద్యార్థులు తమ ఎంపికలో ఈ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పూర్తి వివరాలకు 98665 60960, 90597 62412 కు సంప్రదించాలని కోరారు.
