బీజేపీ విజయోత్సవ సంబరాలు..

బీజేపీ విజయోత్సవ సంబరాలు..

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ ఈరోజు వెలువడిన ఫలితాలలో పశ్చిమ బెంగాల్, అస్సాం పుదుచ్చేరి మూడు రాష్ట్రాల్లో బిజెపి విజయ డంక మోగించిన శుభ సందర్భంగా నాగర్ కర్నూల్ బస్టాండ్ కూడాలిలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకున్న బిజెపి నాయకులు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు పాల్గొని భారతీయ జనతా పార్టీ పునాది పశ్చిమ బెంగాల్ లో పుట్టిందని అక్కడ పుట్టిన నాయకులే డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయ సాధన తో పని చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా అనేకమంది నాయకులు దేశంలో చేస్తున్నటువంటి నిస్వార్థ సేవ దేశ భద్రత దేశ ఆర్థిక వ్యవస్థ అంత్యోదయ సిద్ధాంతం అమలు కార్యక్రమాలను ఎలాంటి స్కాం లేనటువంటి పరిపాలన అందించినందుకే మూడు రాష్ట్రాల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఆత్మవిశ్వాసము కలిగి మంచి మెజార్టీతో గెలిపించిందని వారన్నారు పశ్చిమ బెంగాల్ అస్సాం పుదుచ్చేరి ప్రజా తీర్పుగా భావించి రాబోయే కాలంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని వారన్నారు.

దేశంలోపల 370 ఆర్టికల్ రామ జన్మభూమి త్రిపుల్ తలాక్ ప్రతి విషయం లోపల దేశ ఐక్యతకు సంబంధించిన విషయాలు ఒక దేశం ఒకే చట్టం అందరికీ న్యాయం జరిగే విధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో పనిచేస్తున్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలు బ్రహ్మరథం పడుతున్నాయని వారన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్ , రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ సుధాకర్ రెడ్డి మాయని శ్రీశైలం, జిల్లా ఆఫీస్ సెక్రటరీ చందు జిల్లా కోశాధికారి రాజా రామేశ్వర్ టౌన్ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ నాగర్ కర్నూల్ రూరల్ మండలాధ్యక్షుడు నోమేశ్వర్ రెడ్డి ,టౌన్ మాజీ అధ్యక్షులు ఎలిమే రాము, ప్రధాన కార్యదర్శిలు మల్లేష్ గారు,జగదీశ్వర్ రెడ్డి బొట్టు శీను, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, తాడూరు మండలం మాజీ అధ్యక్షులు లోహిత్ రెడ్డి ఆంజనేయులు కౌన్సిలర్ అభ్యర్థులు, గాడి సుధాకర్ శ్రీనాథ్ గౌడ్ పరశురాములు పెదబాబు, గణేష్ సీనియర్ నాయకులు యాదగిరి రావు తిప్ప విష్ణు భీమయ్య బూతు అధ్యక్షులు ఆంజనేయులు పుట్ట లక్ష్మణ్ రంజిత్ కుమార్ జాజాల కృష్ణ లక్ష్మారెడ్డి రమేష్ రామచంద్రారెడ్డి, బీజేవైఎం యువ నాయకులు శారద శివ నరేష్ మొదలగు వారు పాల్గొనడం జరిగింది.

Leave a Reply