వరి కోత మిషన్ లో పడి రైతు మృతి..

పెద్దమందడి, ఆంధ్రప్రభ : వరి కోత మిషన్ లో ప్రమాదవశాత్తు పడి రైతు మృతి చెందినట్లు ఎస్సై శివ కుమార్ తెలిపారు. వనపర్తి మండలం అంకూర్  గ్రామానికి చెందిన రాకాసి శ్రీనివాస్ రెడ్డి (45) పెద్దమందడి మండల శివారులోని తన వ్యవసాయ పొలంలో వరి కోత మిషన్ తో వరి కోస్తుండగా మిషన్ లో పడి అక్కడికక్కడే మృతి చెందాడని ఆయన తెలిపారు. మృతి చెందిన వ్యక్తి కి భార్య జానకి, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు చెప్పారు.