110seats | ‘విజిల్‌’తో ఆనందం వ్యక్తం చేసిన విజయ్‌ కుటుంబం

110seats | ‘విజిల్‌’తో ఆనందం వ్యక్తం చేసిన విజయ్‌ కుటుంబం

110seats | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. కార్యకర్తలు, అభిమానులతో పాటు విజయ్‌ కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా ‘విజిల్‌’ వేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.

ప్రస్తుతం టీవీకే పార్టీ సుమారు 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 118 కాగా, టీవీకే దానికి చేరువ కావడంతో ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో విజయ్‌ కుటుంబ సభ్యులు పార్టీ గుర్తు అయిన ‘విజిల్‌’ను సూచిస్తూ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్నికల ఫలితాల తుది దశ కొనసాగుతుండగా, టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఎంతవరకు చేరుకుంటుందన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.