ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో అవుట్!

ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో అవుట్!

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే ఘనవిజయం సాధించింది. ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. 204 పరుగులు లక్ష్యంతో బరీలోకి దిగిన సీఎస్కే నిర్ణీత లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే ఛేదించింది.

ఓపెనర్లు శాంసన్ (28), రుతురాజ్ గైక్వాడ్ (42) జట్టుకు బలమైన పునాది వేశారు. ఈ మ్యాచ్‌లో ఊర్విల్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. కేవలం 23 బంతుల్లోనే 65 పరుగులు సాధించి, లీగ్‌లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశారు. అనంతరం వచ్చిన కార్తీక్ శర్మ 20, బ్రెవిస్ 10 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు ఈ సీజన్‌లో లక్నోకు ఇది 8వ ఓటమి. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో వెనుకబడి ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.