Breaking News | ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట – 11మంది దుర్మరణం

బెంగళూరు: ఆర్సీబీ గెలుపు సంబ‌రాల‌లో విషాదం చోటు చేసుకుంది.. ఐపిఎల్ ట్రోపీని సాధించిన సంద‌ర్బంగా బెంగ‌ళూరు చిన్న స్వామి స్టేడియంలో నిర్వ‌హించిన గెలుపు ప‌రేడ్ కు వేలాదిగా అభిమానులు త‌ర‌లివ‌చ్చారు.. దీంతో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో11 మంది దుర్మ‌ర‌ణం చెందారు.. ప‌లువురు గాయ‌ప‌డ్డారు.. వారిలో అనేక‌మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది..

కాగా
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జ‌రిగిన ఈ విక్ట‌రీ కార్య‌క్ర‌మంలో గవర్నర్‌, సీఎం, మంత్రులు, టీమ్ స‌భ్యులు పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భంగా త‌మ అభిమాన క్రీడాకారుల‌ను చూసేందుకు స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు తోసుకెళ్లారు.. బారికేడ్లు దూకి లోప‌లికి ప్ర‌వేశించారు. ఒక్క‌సారిగా వేలాది మంది చొచ్చుకురావ‌డంలో అభిమానులను పోలీసులు అదుపుచేయలేకపోయారు. ఈ సమ‌యంలోనే తొక్కిస‌లాట జ‌రిగింది.. అనేక‌మంది గాయ‌ప‌డ్డారు.. గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం త‌ర‌లిస్తుండ‌గా వారిలో 11 మంది మ‌ర‌ణించారు..

Leave a Reply