ఉద్యాన రైతుల అవగాహన సదస్సు విజయవంతం చేయండి
ఉద్యాన రైతుల అవగాహన సదస్సు విజయవంతం చేయండి
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 5వ తేదీన ఉద్యాన రైతులకు అవగాహన కోసం నల్లగొండ నియోజక వర్గ స్థాయి సదస్సును దర్వేశిపురంలో నిర్వహిస్తున్నట్టు నల్లగొండ నియోజకవర్గ ఉద్యాన అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు కనగల్,నల్లగొండ, మాడుగులపల్లి, తిప్పర్తి మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సదస్సులో ఆయిల్ ఫామ్ సాగు తో పాటు ఉద్యాన పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ సదస్సుకు ఉద్యాన శాఖ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు హాజరై రైతులకు ఉద్యానపంటల సాగు గురించి తెలియజేస్తారన్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతుల ప్రయోజనం కోసం నిర్వహిస్తున్న ఈ సదస్సుకు పెద్ద ఎత్తున రావాలని కోరారు.
