సహకార సంఘ అభివృద్ధికి పాటుపడండి…!
సహకార సంఘ అభివృద్ధికి పాటుపడండి…!
కేంద్ర మంత్రి బండి సంజయ్
తిమ్మాపూర్ ఆంధ్ర ప్రభ న్యూస్ : ఒకరికొకరు సహకరించుకుంటూ సహకార సంఘాల అభివృద్ధికి పాటుపడాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణకాలనీ గ్రామానికి చెందిన మత్స్యశాఖ సహకార సంఘ సభ్యులు ఆదివారం కేంద్ర మంత్రి ని కలిసారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో చైర్మన్ గా గెలిచినటువంటి బోళ్ల శంకర్, కోశాధికారి దాసరి తిరుపతి, డైరెక్టర్ లు గంగు రాజమల్లు,గోనెల పర్శరాములు,పండుగ శ్రీనివాస్,కోతి మల్లేశం,కోతి రాజుకుమార్ లకు కేంద్ర మంత్రి శాలువాలతో సన్మానం చేసి అభినందించారు.అనంతరం గ్రామంలో ఉన్నటువంటి చెరువుల అభివృద్ధి కి కేంద్ర నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ద్వారా మంత్రి ని కోరారు. బీజేపీ మాజీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గంగు తిరుపతి, పండుగ రాజయ్య,గంగు లక్ష్మణ్ తదితరులు కేంద్ర మంత్రిని కలిసివారిలో ఉన్నారు.
