గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి

  • ఐటీడీఏ నూతన ప్రాజెక్ట్ అధికారి మంద మకరంద

జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయిగ్రామాన్నిఉట్నూర్ ఐటీడీఏ నూతన ప్రాజెక్ట్ అధికారి మంద మకరంద ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాల డప్పు వైద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ మహిళలు నుదుటి తిలకం దిద్దగా,పూల బొకే అందజేసి గ్రామపంచాయతీ సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పిఓ ఆదివాసి ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్, ఆదివాసి పోరాటయోధుడు కొమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డార్ఫ్ మ్యూజియాన్ని సందర్శించి చారిత్రక విషయాలను వివరంగా తెలుసుకున్నారు. అలాగే హైమన్ డార్ఫ్ రీడింగ్ లైబ్రరీ, కాటేజ్, పద్మశ్రీ గుసాడి శిక్షణ కేంద్రం, గొండ్వాన పంచాయతీ రాజ్ సెంటర్ దర్బార్ స్థలం, 1941లో డార్ఫ్ దంపతులు నివసించిన ప్రదేశం, ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలుర పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి అన్ని వివరాలను తెలుసుకున్నారు.

తదుపరి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు అధ్యక్షతన మాట్లాడుతూ.. చారిత్రక ప్రాధాన్యం గల మార్లవాయి గ్రామాన్ని ప్రత్యేక నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. డార్ఫ్ నివేదిక ప్రకారం ఆదివాసుల అభివృద్ధి జరగాలని, ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

రాగాపూర్ నుండి మార్లవాయి వరకు ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలని, గ్రామ చివరలో ఉన్న చెరువు ఆయకట్టను పెంచి కుడి-ఎడమ కాలువలు ఏర్పాటు చేసివ్యవసాయానికి నీటి సదుపాయంకల్పించాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని, డార్ఫ్ దంపతుల వర్ధంతి సభను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని పి ఓ కు విన్నవించారు. తెలంగాణ రాష్ట్రపర్యాటకశాఖమంత్రివర్యులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంజూరు చేసిన పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని కూడా కోరారు.

ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి మంద మకరంద మాట్లాడుతూ… ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఆదివాసుల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుల స్ఫూర్తి అందరికీ ఆదర్శమని తెలిపారు. వారు చూపిన మార్గంలో ఆదివాసీలు ముందుకు సాగడం గొప్ప విషయమని, విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో ప్రత్యేక చర్యలు తీసుకొని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పనిచేస్తామని పేర్కొన్నారు. పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలని, డ్రాప్‌ఔట్ లేకుండా ప్రతి విద్యార్థి పాఠశాలలో కొనసాగేందుకు తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని సూచించారు.

అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులు డార్ఫ్ దంపతుల చిత్రపటాన్ని బహుకరించి,ప్రాజెక్ట్ అధికారికి ఆత్మీయ సన్మానం చేశారు. డార్ఫ్ నివేదిక పుస్తకాన్ని గ్రామస్తులు అందజేశారు.గ్రామస్థులు మాట్లాడుతూ, ప్రాజెక్ట్ అధికారి గ్రామానికి రావడం ఎంతో సంతోషకరమని, తెలంగాణ బిడ్డగా ఈ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహనతో మాట్లాడటం ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం రెండు గంటల పాటు సమయం కేటాయించి, అందరి అభిప్రాయాలను తెలుసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అసిఫాబాద్డిటీడీఓరమాదేవి,జైనూర్ఏటీడీఓశ్రీనివాస్, గ్రామ పెద్దలు పటేల్ ఆత్రం మాణిక్ రావు, దేవరీ కనక గణపత్, ఉపసర్పంచ్ ఆత్రం రాజేశ్వర్, జైనూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మండాడి లింగు, వార్డ్ సభ్యులు భరత్, పుల్లాబాయి, పార్వతి గణపత్, దర్యావంతి గోవిందరావు, సీత, పిసా మొబిలైజర్ యాదవ్, వివో అధ్యక్షులు కనక రూపాయి, ఆశ వర్కర్ చంద్రకళ, వివో ఏ సీత, గ్రామస్తులు భగవంతురావు, బారికరావు హనుమంతరావు, భుజంగ్ రావ్, రాము, సోనేరావ్, దేవ్ షా, తుకారం,చందు, లచ్చు, శీను తదితరులు పాల్గొన్నారు.