24 hours I ఏసీ ప్రమాదాల నివారణకు గోల్డెన్ రూల్స్
24 hours I ఏసీ ప్రమాదాల నివారణకు గోల్డెన్ రూల్స్
24 hours I ఏసీలు ఎందుకు పేలుతున్నాయి?
ప్రమాదాలను నివారణకు గోల్డెన్ రూల్స్
24 డిగ్రీల సూత్రం పాటించండి
ప్రతి ఏసీకి ప్రత్యేక ఎంసీబీ
నిరంతర వాడకం వద్దు
24 hours I ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ః ప్రస్తుతం భానుడి భగభగలకు ఏసీ (ఎయిర్ కండీషనర్) అనేది లగ్జరీ నుంచి అవసరంగా మారిపోయింది. అయితే, ఉపశమనాన్ని ఇచ్చే అదే ఏసీలు కొన్నిసార్లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏసీ పేలుళ్లు, అగ్నిప్రమాదాలు, దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అసలు ఏసీలు ఎందుకు పేలుతున్నాయి? ఇలాంటి ప్రమాదాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
24 hours I ఏసీలు ఎందుకు పేలుతున్నాయి?
ఢిల్లీ వంటి నగరాల్లో ఉష్ణోగ్రతలు 45-50 డిగ్రీలు దాటడం వల్ల ఏసీలపై విపరీతమైన భారం పడుతోంది. ఎండ తీవ్రత వల్ల అవుట్డోర్ యూనిట్ వేడెక్కడం, దానికి తోడు గంటల తరబడి ఏసీని వాడటం వల్ల కంప్రెషర్ విస్ఫోటనానికి దారితీస్తోంది. ఏసీకి అవసరమైన లోడ్‌ను తట్టుకోలేని తక్కువ నాణ్యత గల వైర్లు వాడటం వల్ల షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయి. అలాగే ఏసీలో వాడే గ్యాస్ లీక్ అయ్యి, విద్యుత్ స్పార్క్స్ తగిలినప్పుడు అది బాంబులా పేలుతుంది. ఇండోర్, అవుట్డోర్ యూనిట్లలో దుమ్ము చేరి గాలి ప్రసరణ (Air Flow) ఆగిపోవడం వల్ల కూడా యంత్రంపై ఒత్తిడి పెరుగుతుంది.
ప్రమాదాలను నివారణకు ‘గోల్డెన్ రూల్స్’
24 డిగ్రీల సూత్రం పాటించండి
చాలామంది త్వరగా చల్లబడాలని ఏసీని 16 లేదా 18 డిగ్రీల వద్ద పెడతారు. దీనివల్ల కంప్రెషర్ విరామం లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఏసీని 24°C నుండి 26°C మధ్య ఉంచడం వల్ల యంత్రంపై భారం తగ్గడమే కాకుండా విద్యుత్ ఆదా అవుతుంది. అవుట్డోర్ యూనిట్‌ను ఇరుకైన ప్రదేశాల్లో ఉంచకండి. దాని చుట్టూ కనీసం రెండు అడుగుల ఖాళీ ఉండాలి. వేడి గాలి బయటకు వెళ్లే మార్గంలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు.

ప్రతి ఏసీకి ప్రత్యేక ఎంసీబీ
ఏసీ కనెక్షన్ నేరుగా ప్లగ్ పాయింట్ కి కాకుండా, ఒక నాణ్యమైన ఎంసీబీ(మినీచర్ సర్క్యూట్ బ్రేకర్) ద్వారా ఉండాలి. ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఇది వెంటనే పవర్‌ను కట్ చేసి ప్రమాదాన్ని అడ్డుకుంటుంది. ఏడాదికి కనీసం రెండుసార్లు ప్రొఫెషనల్ టెక్నీషియన్ చేత సర్వీసింగ్ చేయించాలి. ముఖ్యంగా వేసవి ప్రారంభానికి ముందే గ్యాస్ లీకేజీలు, వైరింగ్‌ను తనిఖీ చేయించడం ఉత్తమం.
నిరంతర వాడకం వద్దు
ఏసీని 24 గంటలూ వాడకుండా, మధ్యలో ఒక గంట విరామం ఇవ్వండి. గది చల్లబడిన తర్వాత ఫ్యాన్ వేసుకుని ఏసీని ఆపివేయడం వల్ల కంప్రెషర్ చల్లబడే అవకాశం ఉంటుంది. ఏసీ నుంచి ఏదైనా కాల్చిన వాసన వచ్చినా లేదా పొగ వచ్చినా వెంటనే మెయిన్ పవర్ ఆపేయండి.
ఏసీ పేలినప్పుడు నీటిని చల్లకండి (ఎలక్ట్రికల్ ఫైర్ కాబట్టి). కేవలం ఫైర్ ఎక్స్టింగ్యుషర్ లేదా ఇసుక వాడండి. వెంటనే కిటికీలు, తలుపులు తెరిచి గాలి బయటకు వెళ్లేలా చూడండి.
