సాహో …మంత్రి శ్రీధర్ బాబు సాహో..
సాహో …మంత్రి శ్రీధర్ బాబు సాహో..
నిజయోజక వర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయింపు
10 మండలాల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
మంథని, ఆంధ్రప్రభ : మంథని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరోసారి భారీ నిధులను మంజూరు చేయించారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న 10 మండలాల్లో సి ఆర్ ఆర్ కింద సీసీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి పనుల కోసం రూ.15 కోట్ల నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంథని మండలంలో అడవిసోమన్ పల్లి గ్రామానికి 10 లక్షలు, అక్కేపల్లి , ఆరెంద, బెస్తపల్లి, భట్టుపల్లి, బిట్టుపల్లి, చిల్లపల్లి, చిన్నఓదెల, దుబ్బపల్లి గ్రామాలకు 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు.
ఎక్లాస్ పూర్ గ్రామానికి 25 లక్షలు (ఎక్లాస్ పూర్ – 15, నెల్లిపల్లి – 5 లక్షలు & శాస్తుర్లపల్లి – 5), గద్దలపల్లి, గాజులపల్లి గ్రామాలకు రూ. 10 లక్షలు, గోపాల్ పూర్ – 5 లక్షలు, గుమ్నూర్ – 15 లక్షలు (గుమ్నూర్ – 5, దంతలపల్లి – 5, లక్ష్మీపూర్ – 5), గుంజపడుగు గ్రామానికి రూ. 30 లక్షలు మంజూరు చేయించారు. కాకర్లపల్లి, కన్నాల, ఖానాపూర్ గ్రామాలకు 10 లక్షలు మంజూరు చేయించారు. ఖాన్సాయిపేట, మైదుపల్లి, నగరంపల్లి, పుట్టపాక, సిరిపురం, తోటగోపయ్యపల్లి, వెంకటాపూర్ గ్రామాలకు 5 లక్షలు, మల్లారం, మల్లేపల్లి, నాగారం, నాగేపల్లి – 10 లక్షలు (నాగేపల్లి – 5, స్వర్ణపల్లి – 5), పోతారం, సూరయ్యపల్లి, ఉప్పట్ల, విలోచవరం గ్రామాలకు 10 లక్షలు, లక్కేపూర్ గ్రామానికి 35 లక్షల నిధులు మంజూరు చేశారు.

మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం..
గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, పారిశుధ్యాన్ని బలోపేతం చేయడం, ముఖ్యంగా ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ఈ నిధుల ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ నిధులతో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపడి ప్రజలకు సౌకర్యాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
మంత్రికి కృతజ్ఞతల వెల్లువ..
నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు 10 మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సర్పంచ్లు, ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కృషితో మంథని నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
