Manthani నూతన సీఐగా బుద్దే స్వామి
Manthani నూతన సీఐగా బుద్దే స్వామి
- బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి
మంథని, ఆంధ్రప్రభ: మంథని సర్కిల్ నూతన సీఐగా బుద్దే స్వామి నియమితులయ్యారు. మల్టీ జోన్-1 పరిధిలో పనిచేస్తున్న పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఆసిఫాబాద్ సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న బుద్దే స్వామిని మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు.
కాగా, మంథని సీఐగా పనిచేస్తున్న బి. రాజును ఐజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుద్దే స్వామి నియామకంతో మంథని పోలీసు వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
