824 Assembly seats | రేపే ఉత్కంఠకు తెర..

824 Assembly seats | రేపే ఉత్కంఠకు తెర..
824 Assembly seats | ఆసక్తిరేపుతున్న ఎగ్జిట్ పోల్స్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..
పార్టీల నడుమ హెరాహొరీ పోరు..
సీఎంల భవితవ్యం తేలే రోజు..
824 Assembly seats | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : రేపే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే ఈ ఎన్నికల రిజల్ట్స్ కోసం ఆయా రాష్ట్రాల ప్రజలే కాకుండా యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ జోరుగా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బిన్నంగా ఉండడంతో అన్ని పార్టీల కార్యాలయాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ ఎగ్జిట్ పోల్స్ కచ్చితమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. గెలుపు ఎవరిదనేది రేపు అధికారికంగా తేలనుంది. ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల గమనాన్ని మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
824 Assembly seats | ఆసక్తిరేపుతున్న ఎగ్జిట్ పోల్స్..
ఈనేపథ్యంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలోని పార్టీలన్నీ కౌంటింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టాయి. స్ట్రాంగ్ రూమ్‌లపై నిఘాపెట్టాయి. వాస్తవానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల పార్టీల గెలుపోటములపై ఎగ్జిట్ పోల్స్ ఆసక్తిరంగా రిజల్ట్స్ వెల్లడించాయి. అస్సాంలో బీజేపీ కూటమికి స్పష్టమైన మొగ్గుకనిపిస్తోంది. తమినాడులో డిఎంకే, కేరళలో యూడీఎఫ్‌లకు విజయం దక్కే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు తెలిపాయి. బెంగాల్‌లో మమత నాయకత్వంలోని టీఎంసీ పార్టీ బీజేపీకి మధ్య రసవత్తర పోరు జరిగిన్నట్లు వెల్లడించాయి. బెంగాల్‌లో మమత అన్ని తానై నడిపించారు. సంక్షేమ పథకాలను ప్రస్థావిస్తూ ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే, బీజేపీ సైతం దీనికి దీటుగా ప్రచారం పర్వాన్నికొనసాగించింది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఉదృతంగా ప్రచారం చేపట్టారు. టీఎంసీ, బీజేపీలు హెరాహెరీగా తలపడ్డాయి.
824 Assembly seats | పార్టీల నడుమ హెరాహొరీ పోరు..
తమళనాడు లో టీవీకే పార్టీతో విజయ్ ఎంట్రీతో ట్రయంగిల్ పోరు నెలకొన్నది. సీఎం స్టాలిన్ నాయకత్వంలోని అధిఆర డీఎంకే పళనిస్వామి నేతృతంలోని ఏఐడీఎంకే ప్రధాన పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ టీవీకే విజయ్ కూడా బలమైన పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడులో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయింది. ఇది ఎవరికీ కలిసి వస్తుందన్నది? ప్రస్తుతానికి ఉత్కంఠ నెలకొన్నది. ఇక కేరళ విషయానికి వస్తే పినరయి నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమి కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి మధ్య బిగ్ ఫైట్ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్‌డీఏ కూటమిలో కూడా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమికే విజయావకాశాలు ఉన్నాయని అంచనా. అస్సాంలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలోని మహాజౌత్ మధ్య పోటీ నెలకొన్నది. సీఎం హిమంత బిస్వాసేన శర్మ బీజేపీ తరుపున దూకుడుగా ప్రచారం చేయగా కాంగ్రెస్ తరుపున గౌరవ్ గోగోయ్ ప్రచారం నిర్వహించారు. తమిళనాడు పోరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్‌డీఏ కూటమి, ఇండియా కూటమి పోటీ నెలకొన్నది.
824 Assembly seats | సీఎం భవితవ్యం తేలే రోజు..
ఈ ఎన్నికల రిజల్ట్స్ ప్రముఖ రాజకీయ దిగ్గజాల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడులో ఎం.కె. స్టాలిన్, కేరళలో పినరయి విజయన్ వంటి అగ్రనేతల రాజకీయ ప్రస్థానానికి ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై బలంగా ఉండనుందని దని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
824 Assembly seats | కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగిన 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ రిజలట్స్ ప్రకటనకు సర్వం సిద్ధమైంది. సోమవారం(మే 4వ తేదీ) ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఐదు రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాల్లో.. ఏక కాలంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని, మొదటి ఒకటి రెండు గంటల్లోనే తొలి ట్రెండ్‌లు వెలువడతాయని ఎన్నికల సంఘం తెలిపింది. మధ్యాహ్న కల్లా మెజార్టీ ఎవరిదని, సాయంత్రం 4 గంటలకల్లా విజయం ఎవరిదో తేలిపోనుంది వివరించింది. గతాన్ని మించి ఈసారి భారీగా పోలింగ్ నమోదు కావడంతో, ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతుందనేది రేపటితో ఉత్కంఠకు తెరపడనుంది.
