7wicketsIముంబైని ముంచేసిన కాంబోజ్.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
7wicketsI ముంబైని ముంచేసిన కాంబోజ్.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ ఆరంభం నుండే ముంబై వికెట్లను కోల్పోతూ కష్టాల్లో పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా, నమన్ ధీర్ (37 బంతుల్లో 57 పరుగులు) అద్భుత అర్ధసెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అతనికి తోడుగా రికెల్టన్ 37 పరుగులతో రాణించారు. అయితే, కీలక బ్యాటర్లైన సూర్య (21), తిలక్ వర్మ (5), జాక్స్ (1), మింజ్ (5) నిరాశపరిచారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 18 పరుగులు) ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోయారు. దీనివల్ల ముంబై భారీ స్కోరు సాధించే అవకాశాన్ని కోల్పోయింది.
