Abhishek | మ్యాచ్‌కు ముందు దేవుడి దర్శనం

Abhishek | మ్యాచ్‌కు ముందు దేవుడి దర్శనం
Abhishek | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఆదివారం జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆలయ దర్శనం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది.
అభిషేక్ శర్మ ఉదయం కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆలయానికి వచ్చిన అభిమానులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.
ఇంతకుముందు కూడా అభిషేక్ శర్మ హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, పెద్దమ్మ తల్లి ఆలయాలను దర్శించుకున్నారు.
మ్యాచ్‌లకు ముందు దేవాలయాలను సందర్శించడం ఆయనకు అలవాటుగా మారింది. కాగా, ఆదివారం హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఎస్‌ఆర్‌హెచ్ జట్టు సిద్ధమవుతోంది.
