Kiranmayi26yrs | ఫోన్ రీచార్జ్ చేయలేదని…
Kiranmayi26yrs | ఫోన్ రీచార్జ్ చేయలేదని…
Kiranmayi26yrs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రియుడు ఫోన్ రీచార్జ్ చేయలేదన్న చిన్న వివాదం తీవ్ర రూపం దాల్చి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ప్రశాంత్ నగర్‌కు చెందిన కిరణ్మయి (26) 2015లో ప్రేమ వివాహం చేసుకుని అనంతరం భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది. తరువాత బ్యూటీషియన్ కోర్స్ పూర్తి చేసి ప్రైవేట్ సంస్థలో పని చేస్తూ, వెంకటేష్ అనే వ్యక్తితో ఏడాది కాలంగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఫోన్ రీచార్జ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.
రీచార్జ్ చేయకపోవడంతో మనస్తాపానికి గురైన కిరణ్మయి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై ఆమె తల్లి వెంకటేష్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
