Policestation | ప్రేమ మోసం ఆరోపణతో ఫిర్యాదు

Policestation | ప్రేమ మోసం ఆరోపణతో ఫిర్యాదు

Policestation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ మోసానికి గురైనట్లు భావించిన ఓ యువతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్టేషన్‌ భవనం నుంచి దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

బాల్కొండకు చెందిన సాయికుమార్‌తో గత కొన్నాళ్లుగా యువతి ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అయితే, అతడు ముందే పెళ్లైంద‌ని చెప్పకుండా దాచిపెట్టి తనను మోసం చేశాడని యువతి ఆరోపించింది. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె న్యాయం కోసం బాల్కొండ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు ఇచ్చిన వెంటనే యువతి ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్‌ భవనంపైకి ఎక్కి కిందికి దూకేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు వెంటనే స్పందించి నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.