Ayyappa Swamy | మాల ధరిస్తే..

Ayyappa Swamy | మాల ధరిస్తే..
Ayyappa Swamy, బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : అయ్యప్ప మాల ధరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని కామారెడ్డి జిల్లా బిక్కనూర్ అయ్యప్ప సేవా సమితి గురుస్వామి వెంకటసుబ్బారావు అన్నారు. మండలానికి చెందిన పలువురు భక్తులు అయ్యప్ప మాల ధరించి సన్నిధానాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి నిత్య పూజలు అందిస్తున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. 41 రోజులు దీక్షతో స్వామివారికి నిత్య పూజలు అందిస్తే.. అష్ట ఐశ్వర్యాలు కలుగుతూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. మండల కేంద్రంలో గల హరిహరపుత్ర ఆలయంలో మాల వేసుకున్న స్వాములు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రధాన పూజారి శివం స్వామి ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ అయ్యప్ప (Ayyappa)మాల ధరించి నిష్టగా స్వామివారికి పూజలు చేయాలని ఆయన సూచించారు.
