పలు అవార్డులు స్వీకరించిన ఇంపాక్ట్ క్లబ్ ట్రైనర్ శ్రీలత

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ ; నేరేడుచర్ల కు చెందిన ఇంఫాక్ట్ క్లబ్ ట్రైనర్, నారీసెల్ రీజినల్ డైరెక్టర్ వీరవెల్లి శ్రీలత పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరచి అవార్డులకు ఎంపికై స్వీకరించారు. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 2025 సంవత్సరంలో జరిగిన శిక్షణ సేవా కార్యక్రమాలలో క్రౌన్ రీజియన్ నారీసెల్ అవార్డు, అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ నారీ సెల్ అవార్డు, మిస్ ఇంపాక్ట్ తో పాటు స్టార్ స్పీకర్ సర్టిఫికెట్స్ కు ఎంపిక కాగా నల్లగొండలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇంపాక్ట్ నేషనల్ ట్రెజరర్ నూనె సుదర్శన్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
2025 సంవత్సరంలో నారీ సెల్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ త్రిబుల్ టి డబ్ల్యూ ఎస్ లో బెస్ట్ మెంటర్ అవార్డు , బెస్ట్ ఫెసిలిటేటర్ అవార్డు , ప్రాజెక్టు డైరెక్టర్ అవార్డులు కూడా పొందారు.ఈ సందర్భంగా వీరవెల్లి శ్రీలత మాట్లాడుతూ తాను చేసిన శిక్షణ సేవకు ఐకాన్ అవార్డ్స్ రావడం జరిగిందని, పలు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మోటివేషన్ , బాల సురక్ష యాంటీ నార్కోటిక్స్ క్లాసు లను నిర్వహించి చైతన్యం చేసినట్లు, గృహిణి కే పరిమితం కాకుండా తన వంతుగా సమాజంలో విద్యార్థుల విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడం తనకెంతో సంతృప్తి కలిగించిందని అన్నారు.
మహిళలు తమకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు నవీకరణ చేసుకోవాలని పిలుపునిచ్చారు. నారీసెల్ అడ్వైజర్ నళిని నేషనల్ నారీ సెల్ డైరెక్టర్ తబిత లకు కృతజ్ఞతలు తెలిపారు.2026 సంవత్సరానికి నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ నారీసెల్ గా తనను నియమించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ నేషనల్ నేషనల్ డైరెక్టర్ సర్వీసెస్ సాయి కిరణ్ , రీజియన్ ప్రెసిడెంట్ కోటా సరిత, సెక్రటరీ అంజిరెడ్డి, ట్రెజరర్ కవిత, రీజియన్ డైరెక్టర్స్ ప్రవీణ్ , సరస్వతి, రవీంద్ర చారి,బాలు, సరిత, మాధవి, మాలతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
