ఉత్తమ మేనేజ్ మెంట్ అవార్డు అందుకున్న దివిస్ యాజమాన్యం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని రవీంద్ర భారతిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం నుండి పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సంక్షేమానికి విశేష కృషి చేసినందుకు గాను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని దివిస్ పరిశ్రమ యాజమాన్యం ఉత్తమ నిర్వహణ పురస్కారాన్ని [Best management Award] న్ని అందుకుంది. తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా దివిస్ లేబొరేటరీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ మధుబాబు, జనరల్ మేనేజర్ కె. సుబ్బారావు లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ కృష్ణ, కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాలు శాఖ సెక్రటరీ హరీ చందన దాసరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.