Price993 | గ్యాస్ ధరల పెంపుపై రాహుల్ విమర్శలు

Price993 | గ్యాస్ ధరల పెంపుపై రాహుల్ విమర్శలు

Price993 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణ భారం ప్రజలపై పడుతుందని తాను ముందే చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు.
‘ఎక్స్’ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ, ఒక్క రోజులోనే వాణిజ్య సిలిండర్ ధరను రూ.993 పెంచారని పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు మూడు నెలల్లో ఈ ధర 81 శాతం పెరిగి, మొత్తం రూ.1,380 పెరిగిందని వివరించారు. ఈ పెంపుతో టీ స్టాళ్లు, దాబాలు, హోటళ్లు, బేకరీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న వ్యాపారులపై ఇది భారీ భారం అవుతుందన్నారు. ఇప్పుడు గ్యాస్‌పై బాదుడు చూశామని, త్వరలో పెట్రోల్-డీజిల్ ధరల రూపంలో మరో భారం పడే అవకాశం ఉందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. కేంద్రం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Leave a Reply