నర్సింహులపేటలో ఘనంగా మేడే వేడుకలు

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో 140వ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం,తాపీ మేస్త్రి,వ్యవసాయ రైతు కార్మిక సంఘాలతో సిఐటియు హమాలీ సంఘం ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు సూరబోయిన మల్లయ్య జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గునిగంటి మోహన్,కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకుబ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రామిక కర్షక కార్మిక రెక్కల కష్టం వెలకట్టలేనిదని వారి త్యాగం అసమానమైనదని తమ శ్రమతో దేశ ప్రగతికి బాటలు వేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఉస్మాన్, దాసరోజు రామాచారి,పుణ్యపుర్తి ఐలయ్య,రావుల ఉమేష్, కోటి,యాకయ్య,అంగన్వాడి టీచర్ లు ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.