ముప్కాల్ లో బస్ షెడ్డు నిర్మాణంలో ఉద్రిక్తత

బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో బస్ షెడ్డు నిర్మాణంలో గ్రామస్తులకు పోలీసుల మద్య గురువారం ఉద్రిక్తత నెలకొంది.వీడీసీ, గ్రామస్తులు ఏకతాటిపైకి ప్రయాణికుల కోసం బస్ షెడ్డు నిర్మాణం చేపట్టారు.స్థలానికి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిర్మాణాన్ని అడ్డుకున్నారు. గ్రామస్థులు రోడ్డుపై బైటాటించి షెడ్డు నిర్మాణం పూర్తి చేశారు. గత కొద్దిరోజులుగా షెడ్డు నిర్మాణంపై వివాదం కొనసాగుతుంది.

దీనిపై ‘ఆంధ్రప్రభ’ విలేకరి ఆర్మూర్ రూరల్ సిఐ గడ్డం జాన్ రెడ్డిని వివరణ కోరగా ఎలాంటి అనుమతి లేకుండా షెడ్డు నిర్మాణం చేయాటాన్ని తెలుసుకొని రోడ్డుపై వాహన రాకపోకలకు ఇబ్బంది ఉందని చెదరగొట్టామని పేర్కొన్నారు.అయితే కొద్ది సేపు గ్రామస్థులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది.అనుమతి లేకుండా షెడ్డు నిర్మాణం చేపట్టవద్దని సూచించినా వినలేదని పలువురు గ్రామస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Leave a Reply