ఇరాన్ పై దాడులు.. పుతిన్ కఠిన హెచ్చరిక

ఇరాన్ పై దాడులు.. పుతిన్ కఠిన హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా లేదా ఇజ్రాయెల్ సైనిక దాడులు చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని, అది అంతర్జాతీయ సమాజానికే ప్రమాదకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.
ట్రంప్‌తో 90 నిమిషాల సుదీర్ఘ ఫోన్ సంభాషణ సందర్భంగా పుతిన్ ఈ హెచ్చరిక చేశారు. ఈ సంభాషణలో ఇరాన్ వద్ద ఉన్న అపారమైన పరిపుష్ట యురేనియం నిల్వలను ఎలా నియంత్రించాలనే కీలక అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది.
ఇరాన్ వద్ద సుమారు 11 టన్నుల యురేనియం ఉందని, దానిని సురక్షితంగా రష్యాకు తరలించేందుకు తాను సహాయం చేస్తానని ప్రతిపాదించారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా అడ్డుకోవడంలో రష్యాకు కూడా ఆసక్తి ఉందని, ఈ విషయంలో అమెరికాకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.
మే 9న రష్యా విజయ దినోత్సవం సందర్భంగా ఉక్రెయిన్ తాత్కాలికంగా యుద్ధ విరమణ పాటించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఇరాన్‌పై గరిష్ట ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఒక కఠిన ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్ అణు సామగ్రి రష్యా చేతుల్లోకి వెళ్తే, అది రష్యాకు అంతర్జాతీయ రాజకీయాల్లో మరింత ప్రభావాన్ని పెంచుతుందని అమెరికా అధికారులు భావిస్తున్నారు.
