శ్రీవారి సన్నిధిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి

శ్రీవారి సన్నిధిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి

స్వామివారి అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి గురువారం తెల్లవారుజామున టీటీడీ శ్రీరంగం మట్ చైర్మన్ అత్తూరి రాజారెడ్డి తో కలిసి తిరుమల తిరుపతిలో కొలువైన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు. స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్న ఆయన ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చింతల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని” వేడుకున్నట్లుగా వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.

అంతకుముందు సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య ల వివాహం తిరుమలలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తో పాటు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Leave a Reply