టెన్త్ టాపర్స్ కు సన్మానం

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ ; మండలం లోని గోన్ గొప్పుల ప్రభుత్వ పాఠశాల టెన్త్ క్లాస్ టాపర్స్ గా నిలిచిన స్టూడెంట్స్ కు సర్పంచ్ చేపూరి చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ప్రభుత్వ పాఠశాల కు చెందిన టెన్త్ స్టూడెంట్స్ రఘు, సంజన మొదటి, థర్డ్ ర్యాంక్ సాధించడం అభినందనీయం అన్నారు. ర్యాంక్ సాధించిన స్టూడెంట్స్ తో పాటు ర్యాంక్ సాధించేలా కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులను పూల మాల, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో నల్లవెల్లి భోజగౌడ్, భూమేశ్వర్, భూమేష్, హరీష్ తో పాటు వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.