ప్రాంతం ఏదైనా ప్రాధాన్యత మాత్రం ఒక్కటే..
ప్రాంతం ఏదైనా ప్రాధాన్యత మాత్రం ఒక్కటే..
విజయవాడ ఎంపీ చిన్ని
1500 కేఎల్ వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమ
13 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించి స్థానిక ప్రజానీకానికి తాగునీటి కష్టాలకు స్వస్తి చెప్పిన ఎంపీ ఎమ్మెల్యే
పాయికాపురం, ఆంధ్రప్రభ : ప్రాంతం ఏదైనాప్పటికీ ప్రాధాన్యత క్రమంలో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ నందమూరి నగర్ వైవి రావు ఎస్టేట్స్ నందు 1500 కేఎల్ సామర్థ్యంతో ఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ ను ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే బొండావమ్మా కలిసి ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి కుళాయి ద్వారా బిందెలతో నీటిని నింపి మహిళలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రాంతం ఏదైనా ప్రాధాన్యత అందరికీ సమానమేనని ఎంపీ చిన్ని తెలియజేశారు. త్రాగునీటి సమస్య ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రభుత్వ సహాయ సహకారాలతో త్రాగునీటి సమస్యను రూపుమాపే లక్ష్యంగానే పనిచేస్తున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల త్రాగునీటి సమస్య ఏర్పడిందని కోటమీ ప్రభుత్వం దాన్ని రూపుమాపేందుకు అన్ని విధాల కృషి చేస్తుందని తెలియజేశారు.

శివారు ప్రాంతాల్లో సైతం అన్ని ప్రాంతాలకు ఇచ్చే సమాన ప్రాధాన్యతే ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి సూచనలు చేశారని తెలియజేశారు వాటర్ ట్యాంక్ వల్ల మహిళలు ఎంతగానో ఇబ్బంది పడుతున్న త్రాగునీటి సమస్య తీరిందని గుర్తు చేశారు. సుమారు 13 కోట్ల వ్యయంతో 15 ఆర్థిక సంఘం ఏఎంఆర్యుటి పథకం జనరల్ ఫండ్ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో జరిగిన సమావేశంలో విజయవాడ నగరంలోని ప్రధాన సమస్యలు చర్చించామని ఎంపీ గుర్తుచేశారు.

అమరావతి తరహాలోనే విజయవాడ ను సైతం అందంగా అభివృద్ధి పథంగా తీర్చిదిద్దేందుకు కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా మాజీ కార్పొరేటర్లు డివిజన్ ఇన్చార్జులు కూటమి నాయకులు పాల్గొన్నారు.

